టాలీవుడ్ లో అలనాటి స్టార్ హీరోయిన్ జయచిత్ర అంటే అందరికి పరిచయమే.. ఆమె కుమారుడు మ్యూజిక్ డైరెక్టర్ అమ్రేష్ గణేష్ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇంతకీ ఆయన ఏం చేశారు అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
యువ సంగీత దర్శకుడు అమ్రేష్ రూ.26 కోట్ల మోసం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇరిడియం అంటే అతి ఖరీదైన లోహం తమ దగ్గర ఉంది అని ఓ ప్రముఖ వ్యాపారవేత్తని నమ్మించాడు.
ఇది అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయి అని, వ్యాపారంలో లాభం ఉంటుంది అని చెప్పాడు, దాదాపు అతని నుంచి 26 కోట్లు తీసుకున్నాడు…ఇలా .26 కోట్లు తీసుకుని అమ్రేష్, అతని బృందం నకిలీ ఇరిడియం ఇచ్చి మోసం చేశారని పోలీసులకు తెలిపాడు ఆ వ్యాపారి…పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇక అమ్రేష్ కోలీవుడ్ లో మంచి పేరు ఉన్న మ్యూజిక్ దర్శకుడు. తమిళంలో ప్రభు దేవా చార్లీ చాప్లిన్ 2కు సంగీతాన్ని అందించాడు. మ్యూజిక్ దర్శకుడు అవ్వక ముందు అమ్రేష్ నానే ఎన్నూల్ ఇల్లాయ్ అనే చిత్రంలో కూడా నటించాడు. అయితే దీనిపై చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు, ఇలాంటి మూడనమ్మకాలు నమ్మి అంత నగదు ఎలా ఇచ్చారు అని ప్రశ్నిస్తున్నారు.
ReplyForward
|