చాలా మందికి ఓ అనుమానం ఉంటుంది.. మనం మాములు కాల్ అయితే రికార్డ్ చేసుకుంటాం.. మరి వాట్సాప్ కాల్ రికార్డ్ చేయగలమా అసలు ఇది కుదురుతుందా అనిపిస్తుంది..ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నందువల్ల యూజర్ల మెసేజెస్ ఇతరులు చదవలేరని, ఫోటోలు, వీడియోలు ఎవరూ చూడలేరు అని వాట్సప్ ఇప్పటికే చెప్పింది, సో వాట్సాప్ కాల్స్ ఈ మధ్య చాలా వరకూ పెరిగాయి. చాలా మంది అమ్మాయిలని కొందరు పోకిరీలు మోసగాళ్లు బెదిరిస్తున్నారు, అయితే ఇలాంటి వారి ఆటకట్టించవచ్చు.
అయితే వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయడం సాధ్యం కాదు. మరి దీనికి ఏం చేయాలి అంటే కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ తో ఇలా కాల్ రికార్డ్ చేయవచ్చు.ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేస్తే చాలు.
ప్లేస్టోర్లో రికార్డింగ్ యాప్స్ ఉంటాయి. కచ్చితంగా రివ్యూ రేటింగ్ చదివి దాని బట్టీ వాటిని మీరు డౌన్ లోడ్ చేసుకోండి, యూజర్ల డేటాను కాజేసే యాప్స్ ప్లేస్టోర్లో వేలల్లో ఉన్నాయి.. సో ఇలా ఇబ్బంది రాకుండా ఆ యాప్స్ చూసి డౌన్ లోడ్ చేసుకోండి.
వాటిని డౌన్లోడ్ చేసిన తర్వాత వాట్సప్ కాల్ చేస్తే రికార్డింగ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే వెంటనే కాల్ రికార్డింగ్ అవుతుంది. మరి ఐఓఎస్ వారికి ఎలా అంటే ఇక్కడ మరో ఆప్షన్ ఉంది..మీరు వేరే యాప్ డౌన్ లోడ్ చేయక్కర్లేదు
మ్యాక్ బుక్కి కనెక్ట్ చేసి క్విక్ టైమ్ పైన క్లిక్ చేస్తే చాలు. ఆడియో రికార్డ్ అవుతుంది. సో దీని వల్ల మీరు ఆ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, ఎవరైనా ఏడిపించినా మిమ్మల్ని బెదిరించినా ఈ కాల్స్ చూపించి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు
ReplyForward
|