బీజేపీ నేత ఖుష్బూ ఆస్తుల విలువ ఎంతో తెలుసా 

-

తమిళనాట ఎన్నికల సందడి మొదలైంది.. ఇప్పటికే అక్కడ పార్టీలు అన్నీ మేనిఫెస్టోలు ప్రకటించాయి.. అంతేకాదు అక్కడ రాజకీయ పార్టీలు అన్నీ కూడా తమ పార్టీ తరపున నిలబడే అభ్యర్దులని ప్రకటిస్తున్నాయి.. తొలిజాబితాలు విడుదల చేశాయి, అయితే ఇక్కడ ఈసారి సినిమా నటులు చాలా మంది పోటీ చేస్తున్నారు, ముఖ్యంగా కమల్ పార్టీ గురించి చెప్పుకోవాలి ఆయన పార్టీ ఇక్కడ ప్రజల్లోకి వస్తోంది.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ స్ధానాల్లో పోటీ చేయనుంది ఆయన పార్టీ. ఆయన ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు మరో సినిమా నటి నామినేషన్ దాఖలు చేశారు..ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ  నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.
మొత్తం ఆమె ఆస్తి 40.96 కోట్ల రూపాయలు అని తెలిపారు, ఇందులో రూ. 6.39 కోట్ల విలువైన చరాస్తులు, రూ.34.56 కోట్ల విలువైన స్థిరాస్తులతోపాటు 8.5 కేజీల బంగారం, 78 కేజీల వెండి ఉన్నట్టు ఆమె తెలిపారు.. ఇక ఆమె భర్త సుందర్ దగ్గర
 495 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి ఉన్నట్టు తెలిపారు.
ఇక ఏడాదికి ఆమె ఆదాయం .1.50 కోట్ల రూపాయలని ఖుష్బూ తెలిపారు. ఇక ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే …చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం టికెట్ను బీజేపీ అధిష్ఠానం ఆమెకు కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...