కిన్నో ఫ్రూట్ చూస్తే సేమ్ కమలాపండులాగా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అయితే దీని వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి..కమలాపండులా ఇది కూడా సిట్రస్ జాతికి చెందిన పండు, సేమ్ అలాగే ఉంటుంది, ఇది మన దేశంలో పంజాబ్ లో ఎక్కువగా పండిస్తున్నారు, ఇక పాకిస్దాన్ లో కూడా దీని పంట ఎక్కువ. ఇక మన దేశంలో ఈ పంటని 1935 లో స్టార్ట్ చేశారు.
ఇప్పుడు చాలా శీతల ప్రాంతాల్లో పండిస్తున్నారు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు ఉత్తర ప్రదేశ్ లో పండిస్తున్నారు. దీనిలో చాలా వరకూ యాంటి యాక్సిడెంట్లు ఉంటాయి, ఇక ఏమైనా ఒంట్లో విషపదార్దాలు ఉంటే తొలగించడానికి ఇది సాయం చేస్తుంది.
చర్మం కాంతివంతంగా ఉంటుంది. రోజుకి ఒకటి తిన్నా చాలా మంచిది, ఇక ఇందులో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది, ఇక కడుపులో ఏమైనా సమస్యలు ఉన్నా తగ్గుతాయి… ఎసిడిటి తో బాధపడే వాళ్లకు మంచి పరిష్కారం ఈ పండు అనే చెప్పాలి.. కొందరు కాన్స్టిపేషన్ ఇబ్బంది పడుతూ ఉంటారు వారికి ఇది మేలు చేస్తుంది. బీపీ కంట్రోల్ లో ఉంటుంది.