మాములుగా మనం చికెన్ కాని మటన్ కానీ తినే సమయంలో ఆ ఎముక ముక్కలు లాంటివి గొంతుకు అడ్డుపడతాయి,
ఇక చేప తింటే చాలా మందికి ఆ ముల్లు గుచ్చుకుని గొంతులో అడ్డుపడతాయి.. అయితే చాలా మంది ఇలా ముల్లు లేని
చేపలు మాత్రమే తినడానికి ఇష్టపడతారు.. ఇలా ముల్లు గొంతులో అడ్డుపడటం విన్నాం కాని ఏకంగా ఈ వ్యక్తికి గొంతులోనే చేప అడ్డుపడింది. అసలు ఏం జరిగింది అంటే.
ఈజిప్టుకు చెందిన మత్స్యకారుడి ని బెనీ సుయిఫ్ పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. అలీ అల్ అనే వైద్యుడు ఆయనకు చికిత్స చేసి వెంటనే ఆయన గొంతులో ఉన్న చేప తీశారు…ఆయనే ఎండోస్కోపీ సాయంతో ఇలా గొంతులోని చేపను బయటకు తీశారు.. అసలు గొంతులో ఎలా చేప వెళ్లింది అంటే.
నైలు నది ఒడ్డున ఎర వేసి చేపలు పడుతున్న సమయంలో ఈ చిన్న ఫిష్ చిక్కిందట. ఆ చేప పట్టుకుని ఉండగా మరొకటి చిక్కింది ..దీనిని వెంటనే నోట్లో పెట్టుకుని పట్టుకున్నాడు ..కాని అది ఏకంగా నోటిలో జారుకుంది… సో ఇలా అతని గొంతులో ఈ చేప వెళ్లింది, ఇక అతనికి శ్వాస ఆడలేదు చివరకు కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.