చిత్ర సీమలో సోగ్గాడు అంటే శోభన్‌బాబు అనే చెప్పాలి, ఇప్పటీకీ ఆయనకు అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఆయన సినిమా
వస్తోంది అంటే టీవీల ముందు అలా ఉండి చూస్తారు… ఇక మహిళా అభిమానులు ఎక్కువ శాతం మంది ఆయనకే ఉన్నారు.. ఇక ఆయనతో సినిమా తీయాలి అని చాలా మంది కోరికగా ఉండేది.. దర్శకులు నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టేవారు.
ఆయన కొన్ని రూల్స్ పెట్టుకుంటారు.. ఆయన అవి కచ్చితంగా పాటిస్తారు.. సినిమా షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆ రూల్స్ ఆయన పాటించేవారు.. ఏ సినిమా ఒప్పుకున్నా ఆయన కచ్చితంగా సాయంత్రం ఆరు గంటలకు ఇక నేను షూటింగులో ఉండను, ఈలోపు మీరు పూర్తి చేసుకోవాలి అని చెబుతారు, అంతేకాదు ఆదివారం షూటింగులో పాల్గోను అని కూడా చెబుతారు.
ఇది ఇష్టమైతే నన్ను హీరోగా పెట్టుకోండి. లేకపోతే మరో హీరో దగ్గరకు వెళ్లండి..ఇంత నిక్కచ్చిగా ఆయన ముందు నిర్మాత దర్శకుడికి చెప్పేవారు.. ఆరు గంటలకు ఆఫీసు నుంచి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో గడిపేవారు… కుటుంబానికి చాలా ప్రయారిటీ ఇచ్చేవారు…ఇక తమ వారసులకి ఏ రంగం ఇంట్రస్ట్ ఉందో అటువైపు పంపించారు అంతేకాని సినిమాలు చేయాలి అని ఎక్కడా చెప్పలేదు.
|
|
సినిమా స్టార్ట్ అయ్యేముందు దర్శకుడికి నిర్మాతకి – ఈ రూల్ చెప్పేవారట శోభన్ బాబు
-