ఈ రోజుల్లో పెళ్లి విషయంలో చాలా వరకూ ఆందోళన ఉంటోంది… ఎందుకు అంటే పెళ్లి అయ్యే వరకూ ఇటు అమ్మాయి అటు అబ్బాయికి అలాగే వారి కుటుంబ సభ్యులకి మాములుగా టెన్షన్ ఉండటం లేదు.. ఎందుకు అంటే ఎప్పుడు ఎవరు ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు అనే మాట చెబుతారా అనే డౌట్ చాలా మందికి ఉంటోంది. ఇక చివరి నిమిషంలో నాకు పెళ్లి వద్దు నాకు లవర్ ఉన్నారు అనే మాట ఇటీవల కొన్ని మండపాల్లో వింటున్నారు, సో ఇదే పెద్ద టెన్షన్ పెట్టిస్తోంది.
మేనకోడలితో అతనికి నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్ మెంట్ సమయంలో అందరూ బాగానే ఉన్నారు.. అయితే ఆమె కూడా నచ్చినట్టే కనిపించింది… కాని మేనమామతో రింగ్ తొడిగించుకుంది. ఇక నెల అయింది అయితే ఇటీవల రెండు రోజులుగా ఆమె కనిపించలేదు.
చివరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అందరికీ షాకిచ్చిన ఆ యువతి. ఓ యువకుడితో వెళ్లిపోయింది. అతడ్ని ప్రేమించానని.. పెళ్లి కూడా చేసుకున్నానంటూ.. ఆ ఫోటోలను తన తల్లికి వాట్సాప్ చేసింది. చివరకు వెంటనే పోలీసులకు ఈ విషయం చెప్పారు, చివరకు వారిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.