సౌదీ అరేబియాలో చట్టాలు ఎలా ఉంటాయో తెలిసిందే, మరీ ముఖ్యంగా ఇక్కడ చట్టాలు మరెక్కడా అమలు చేయరు, చాలా కఠిన చట్టాలు ఉంటాయి, అయితే తాజాగా ఓ రూల్ తీసుకువచ్చారు పాలకులు, దీని గురించి సౌదీలోనే కాదు అన్నీ దేశాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు… అయితే అక్కడ విదేశీ వనితలను చాలా మంది వివాహం చేసుకుంటున్నారు… దాదాపు ఐదారు సంవత్సరాలుగా ఈ సంసృతి మరింత పెరిగింది.
దీంతో అక్కడ పాలకులు దీనిపై దృష్టిపెట్టారు…నాలుగు దేశాల అమ్మాయిలను సౌదీ పురుషులు పెళ్లాడద్దని తాజాగా ఆంక్షలు విధించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్ వనితలను ఇకపై సౌదీ పురుషులు పెళ్లి చేసుకోవడానికి ఉండదు, దాదాపు లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ ఐదు లక్షల మంది అమ్మాయిలు ఈ నాలుగు దేశాల నుంచి వచ్చి వివాహం చేసుకున్నారు.
ఇక ఇలా ఎవరూ వివాహం చేసుకోవడానికి లేదు, ఇక ఇతర దేశాలకు చెందిన వారిని ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అని భావించినా కచ్చితంగా అక్కడ ధరఖాస్తు చేసుకోవాలి.. అందులో ఈ నాలుగు దేశాల వారు ఉండకూడదు…అంతేకాదు రెండో పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నా , కచ్చితంగా ఆరునెలల విరామం తీసుకోవాలి..తర్వాత విదేశీ వనితను పెళ్లి చేసుకుంటున్నాము అని అప్లై చేసుకోవాలి.
|
|
సౌదీ అరేబియాలో కొత్త రూల్ – ఈ నాలుగు దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దు
-