ఇటీవల కొందరు దుర్మార్గులు మహిళలని ఎలా వేధిస్తున్నారో తెలిసిందే …ఇక మగతోడు లేకపోతే వారిని మరీ అలుసుగా చూస్తున్నారు… ఇలాంటి ఓ కామాంధుడికి మహిళ గుణపాఠం చెప్పింది,..మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సిధి జిల్లా ఖాడ్డీ పోలీస్ స్టేషన్ పరిధి ఉమరిహా గ్రామానికి చెందిన మహిళ ఇంట్లో నిద్రిస్తోంది, ఆమె కుమారుడు కూడా ఆమెతోనే ఉన్నాడు.
ఈ సమయంలో ఇంట్లోకి దొంగ ప్రవేశించాడు, వెంటనే అరుపులు అరుస్తూ ఆమె కుమారుడు పక్కవారిని పిలవాలి అని వెళ్లాడు, అయితే ఈలోపు బెడ్ రూమ్ లో ఆమె దగ్గరకు ఆ వ్యక్తి వెళ్లి ఆమెని అత్యాచారం చేయబోయాడు… ఆమె అతనితో చాలా సేపు పెనుగులాడింది….మంచం కింద ఉన్న కొడవలి తీసుకుని అతడి మర్మాంగాలను కోసేసింది. చివరకు అర్థరాత్రి 1.30 గంట ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది.
ఇక ప్రస్తుతం అతనిని ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతున్నాడు, ఇక అతనిపై ఆమె కేసు పెట్టింది, ఇక ఆమె కూడా తనపై దాడి చేసింది అని అతను కూడా కేసు పెట్టాడు, రెండు కేసులు నమోదు చేసుకున్నారు పోలీసులు.