దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన సమయంలో రైల్వే శాఖ పూర్తిగా రైళ్లు రద్దు చేసింది, తర్వాత రాజధాని నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లు నడిపింది… ఇలా కొన్ని కొన్ని ప్రత్యేక రైళ్లు మాత్రమే నడిపింది, ఇప్పటికీ ఇలా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి, పూర్తిస్ధాయిలో రైళ్లు అన్నీ పట్టాలెక్కలేదు, అయితే వచ్చే నెల నుంచి అన్నీ రైళ్లు పట్టాలు ఎక్కుతాయి అని రెగ్యులర్ రైళ్లు కూడా నడుస్తాయి అని అందరూ అనుకుంటున్నారు.
కాని కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ ఇలాంటి ఆలోచన చేయడం లేదు రైల్వేశాఖ…తాజాగా జులై వరకు ఆ ఊసే లేదని పరోక్షంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని జూన్ నెలాఖరు వరకు, మరికొన్నింటిని జులై తొలి వారం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అంటే ఈ ప్రత్యేక రైళ్లు మరో నాలుగు నెలలు ఇలాగే నడవనున్నాయి, ఇప్పుడు మళ్లీ అన్నీ రైళ్లు నడిస్తే కచ్చితంగా ఇబ్బందులు తప్పవు అని కేసులు పెరిగే అవకాశం ఉంటుంది అని భావించారు.. సో మరో నాలుగు నెలలు ఇలాంటి ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇప్పటికే 80 శాతం రైళ్లు నడుస్తున్నాయి.
ReplyForward
|