వివాహేతర సంబంధాలు ఆ నిమిషం బాగానే ఉంటాయి ఎప్పుడైతే ఇంట్లో వారికి భర్తలకు భార్యలకు తెలుస్తాయో వారి జీవితాలు ఇక నాశనం అయినట్లే… అంతేకాదు ఎన్నో దారుణాలు జరుగుతాయి… ఇలా కొందరు హత్యకు గురి అవుతున్నారు మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఇంకొందరు జైల్లో ఉంటున్నారు మరికొందరు చివరకు విడాకులు తీసుకుంటున్నారు, అయితే తాజాగా ఓ వివాహేతర సంబంధం చివరకు దారుణమైన పరిస్దితిని తీసుకువచ్చింది.
ఓ పెళ్లయిన మహిళతో కలిసి ఓ యువకుడు ఎస్కేప్ అయ్యాడు. చివరకు ఇరు కుటుంబ సభ్యులు అలాగే గ్రామంలో వారు ఊరంతా వెతికారు.. అయితే పక్కూరి బస్టాప్ లో వారు దొరికారు.. వెంటనే వారిని గ్రామానికి తీసుకువచ్చారు, ఇలా తీసుకువెళ్లడం పై పంచాయతీ పెట్టారు..పెద్దమనుషులు డిపాజిట్ కింద లక్ష రూపాయలు తీసుకున్నారు.
అయితే ఆమె వెంటనే మాటా మార్చింది నన్ను బలవంతగా అతను తీసుకువెళ్లాడు అని చెప్పింది, దీంతో పంచాయతీ పెద్దలు
తప్పంతా ఆ యువకుడిది అని తీర్పు ఇచ్చి . 20 లక్షల రూపాయలను ఆమె కుటుంబానికి పరిహారంగా చెల్లించాలని
చెప్పారు.. లేకపోతే ఎకరం భూమి ఆమెకి ఇవ్వాలి అని అన్నారు. దీంతో ఆ యువకుడు ఎంతో వేదనకు గురి అయ్యాడు, ఆమె మాట మార్చడం భారీ ఫైన్ వేయడంతో పురుగుల మందు తాగి చనిపోయాడు… ఇప్పుడు ఇలాంటి తీర్పు ఇచ్చిన ఈ పెద్దలపై కేసు నమోదు అయింది.
|
|
అఫైర్ పెట్టుకుని యువకుడితో ఎస్కేప్ – చివరకు మాట మార్చేసింది
-