తెలంగాణలో వైయస్ షర్మిల రాజకీయంగా అడుగులు వేస్తున్నారు, కొత్త రాజకీయ పార్టీతో ముందుకు రానున్నారు, అయితే ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేదానిపై అప్పుడే తెలంగాణ పొలిటికల్ కారిడార్లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి, అయితే తాజాగా వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. దీంతో నేతలు ఒక్కసారిగా ఈ సెగ్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు.
ఇక వైయస్ ఆర్ కు పులివెందుల ఎలాగో నాకు పాలేరు అలా అని వైయస్ షర్మిల తెలిపారు, నేడు వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా నేతలతో లోటస్పాండ్లో సమావేశమయ్యారు. ఇక భారీ బహిరంగ సభ పెట్టి పార్టీని ప్రకటించాలి అని చూస్తున్నారు, అయితే కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఇలాంటి సభలకు అనుమతి ఉంటుందా ఉండదా అని అందరూ చర్చించుకుంటున్నారు.
రాజకీయంగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల సభ నిర్వహించనున్నారు. మొత్తానికి ఈ సభలో ఇంకా ఎలాంటి కీలక ప్రకటనలు వస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు… మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడ నుంచి పోటీకి సిద్దం అవుతున్నారు.
ReplyForward
|