దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రికార్డు స్ధాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి, పరిస్దితి
చూస్తుంటే గతంలో కంటే కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి అంటున్నారు.. ఇక నిపుణులు కూడా అవసరం ఉంటేనే బయటకు రావాలి అని చెబుతున్నారు.. వైద్యులు నిపుణులు అధికారులు చెప్పేది ఒకటే మనం మాస్క్ లు ధరించి కచ్చితంగా శానిటైజేషన్ చేసుకోవాలి అని తెలియచేస్తున్నారు.
మొన్న 47,262 మందికి కరోనా నిర్ధారణ కాగా, గత 24 గంటల్లో 53,476 మందికి కరోనా నిర్ధారణ అయింది… దాదాపు ఒక్క రోజులోనే 6 వేల కేసులు పెరిగాయి.. దీంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు, అయితే రికవరీ కేసుల సంఖ్య కంటే
ఈ కొత్త కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది.
నిన్న 26,490 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,87,534కు చేరింది.
అయితే ముంబై దేశ ఆర్ధిక రాజధానిలో కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి, ఇక మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే భారీగా కేసులు నమోదు అవుతున్నాయి… రోజు నమోదు అయ్యే కేసుల్లో సగం ఇక్కడ నుంచి నమోదు అవుతున్నాయి. ఇప్పటికే అక్కడ పలు జిల్లాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి.
ReplyForward
|