పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి టాలీవుడ్ లో ఎంత పేరు ఉందో తెలిసిందే, ఆయన సినిమా వస్తోంది అంటే టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతాయి, అయితే ఆయన సినిమాల్లో హీరోగా నటిస్తూనే తన అభిమానుల కోసం పాటలు కూడా పాడతారు ఆయన చిత్రాల్లో, ఇవి చాలా వరకూ సూపర్ హిట్ అయ్యాయి, ఇలా ఆయన తన సినిమాల్లో దాదాపు 8 పైగా పాటలు పాడారు.
ఇలా టాలీవుడ్ లో ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు, ఇక యూత్ లో ఆయనకు ఉన్న క్రేజ్ కూడా అలాంటిది, ఆయన మరి ఇప్పటి వరకూ ఏఏ సినిమాలో పాటలు పాడారు అనేది చూద్దాం.
తమ్ముడు సినిమా లో ఏం పిల్లా మాటాడవా
తాటి చెట్టుఎక్కలేవు అనే పాటలు పాడారు
ఇక సూపర్ హిట్ చిత్రం ఖుషీలో బాయ్ బాయ్ రే బంగారు రమణమ్మా అనే పాట పాడారు
ఇక జానీ చిత్రంలో నువ్వు సారా తాగుతవురన్నో
రావోయి మా ఇంటికి అనే పాటలు పాడారు.
పంజాలో పాపారాయుడు అనే పాట పాడారు పవన్ కల్యాణ్
ఇక అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా అనే పాట పాడారు
అజ్ఞాతవాసి చిత్రంలో కొడకా కోటీశ్వరరావు ఈ పాట పాడారు
ఇప్పుడు మళయాళ చిత్రం రీమేక్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఇందులో పాట పాడుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
పవన్ కల్యాణ్ ఏఏ సినిమాల్లో పాటలు పాడారో తెలుసా
-