పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్ దారుణమైన పని చేశాడు.. ఈ ఘటన వింటే నిజంగా షాక్ అవుతారు..
పెద్దపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్దిని ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాడు టీచర్, అయితే టీచర్ కదా అని ఆమె నెంబర్ ఇచ్చింది, ఆ బాలికకు వీడియో కాల్ చేశాడు. ఆ పై ఆమె ప్రైవేట్ భాగాలను చూపించాలని నిత్యం వేధింపులకు దిగాడు.
ఇలా చేస్తే నీకు మార్కులు బాగా వేస్తా నీకు ఎంత డబ్బు అయినా ఇస్తా అని బెదిరించాడు, లేకపోతే నిన్ను పది తరగతికి పంపను అని బెదిరించాడు… దీంతో ఆమె రెండు మూడు రోజులుగా చాలా బాధపడుతోంది, ఇక తల్లిదండ్రులకి అనుమానం వచ్చి అడిగితే అసలు నిజం చెప్పింది.
ఆ తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధ్యాయునిపై దాడి చేశారు.
స్కూల్ లో ఉన్న చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. చివరకు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు…దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చారు… అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు.
ReplyForward
|