ఇప్పపువ్వు ఇది చాలా అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు… గిరిజన ప్రాంతాల్లో వారికి బాగా తెలుస్తుంది..
ఇటు విశాఖ ఉత్తరాంధ్రా జిల్లాలు అటు ఒరిస్సా అలాగే ఇటు తెలంగాణలో గిరిజన ప్రాంతాల్లో దీని గురించి వింటూ ఉంటాం.. అయితే ఇప్ప పువ్వు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
దీంతో తయారుచేసిన సారా చాలా మంది తీసుకుంటారు. ఆదివాసీలకు ఇది మంచి ఆదాయ వనరు.. ఇప్ప పువ్వులో ఉండే ఐరన్ కు రక్త హీనత తగ్గించే లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇతర పోషకాలు ఎన్నో ఉన్నాయి. అందుకే దీనిని అక్కడ గిరిజన మహిళలు ఎక్కువగా తీసుకుంటారు.
ఇప్పపువ్వుతో చేసిన లడ్డూలను గర్భిణులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు గిరిజన సంక్షేమ అధికారులు.. మన దేశంలో చాలా ప్రాంతాలలో వీటిని తీసుకుంటారు, అయితే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లోనే దీనిని ఎక్కువ వాడుతున్నారు..
ఆడవాళ్లలో రక్తహీనత అంటే రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం కనపడుతుంది… ఎర్ర రక్త కణాలు తగ్గపోతున్నాయి. సో అందుకే వీటిని అందిస్తున్నారు,
గమనిక
గర్భిణీలు తప్పక తెలుసుకోండి … వైద్యుల సలహా మేరకు మాత్రమే దీనిని తీసుకోవాలి … ఇవి కొందరికి పడకపోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. అందుకే వైద్యులని అడిగి దీనిని తీసుకోవాలి అని చెబుతున్నారు.
|
|
ఇప్పపువ్వు తెలుసా దీనిని ఇక్కడ మహిళలు దేనికి వాడుతున్నారంటే
-