హోలీ వచ్చింది అంటే సందడి మాములుగా ఉండదు …ఈ రంగుల పండుగ దేశం అంతా చేసుకుంటారు, అయితే
పాల్గుణ పౌర్ణమి రోజు రాత్రి హోలిక దహనంతో ఈ సంబరాలు ప్రారంభమవుతాయి. చైత్ర, ఫాల్గుణ, కృష్ణ పక్షంలో భాయ్ దూజ్తో ఇది ముగుస్తుంది. ఏనాటి నుంచో మన దేశంలో ఎంతో ఘనంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం… ఉత్తర ప్రదేశ్లోని దాదాపు వారం ముందు నుంచి ఈ పండుగ వేడుక బాగా చేస్తారు.చాలా మందికి తెలిసిందే హోలీ వేడుకలలో ఎక్కువగా భాంగ్ తాగుతుంటారు. అయితే మన సౌత్ స్టేట్ లో కంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా దీనిని తీసుకుంటారు… భాంగ్ అంటే శివుడి పానీయం అని నమ్ముతుంటారు… అయితే ఇలా ఎందుకు తీసుకుంటారు అంటే చరిత్రలో దీనికి ఓ పురాణ కథ ఉంది..ధ్యానంలో ఉన్న శివుడిని మేల్కోల్పేందుకు పార్వతి దేవి ప్రయత్నం చేస్తుంది, ఈ సమయంలో కామ దేవుడు కూడా ఆమెకి సాయం చేస్తాడు, అయితే ధ్యానం విచ్చిన్నం చేయాలి అని కామ దేవుడు మధన బాణాన్ని పరమేశ్వరుడిపై విసురుతాడు. శివుడు కళ్లు తెరిచి ఆగ్రహిస్తాడు, వెంటనే కాముడ్ని దహనం చేస్తాడు, చివరకు పార్వతి కోరిక మేరకు గృహస్త జీవితంలోకి ప్రవేశిస్తాడు.. ఆ ఆనంద క్షణాలలోనే ప్రజలు భాంగ్ సేవిస్తారని ఆ కథలో తెలియచేశారు…భాంగ్ను పాలు, పిస్తా, చక్కెరతో తయారు చేస్తారు.
|
|
హోలీ రోజు భాంగ్ ఎందుకు తాగుతారో తెలుసా – అసలు ఏమిటిది
-