తమలపాకు లేని పూజ కార్యక్రమం శుభకార్యం ఏదీ ఉండదు, కచ్చితంగా తమలపాకు ఉండాల్సిందే.. అయితే ఇలా తమలపాకు
వాడటానికి ఎంతో ముఖ్య కారణం ఉంది… అయితే ఆయుర్వేదం మనకు కొన్ని వందల ఏళ్ల నుంచి ఉంది.. అనేక మూలికలు ఆకులు వేర్లు ఇలా అనేక రుగ్మతలను తగ్గిస్తున్నాయి…అయితే ఇందులో కూడా తమలపాకు ఎంతో మేలు చేస్తుంది.
దేవుడి దగ్గర పెట్టే ఏకైక ఆకు తమలపాకు. దీనిని మనవారు ఎప్పటి నుంచో వాడుతున్నారు, అయితే మనకు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కార్యక్రమాలు జరిగితే అక్కడ చాలా మంది జనం ఉంటారు… దీని వల్ల ఒకరు పీల్చిన గాలి మరొకరు పీలుస్తూ ఉంటారు.. ఇలా పీల్చడం వల్ల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.
ఇక అలాంటి సమయంలో అక్కడ తమలపాకులు ఉండటం వల్ల వాటి నుంచి వచ్చే కెమికల్స్ ఇలాంటివి అరికడతాయి..
అందుకే ఈ ఆకును పండితులు ప్రాచీన రోజుల్లోనే గ్రహించి అన్ని కార్యాల్లో వినియోగించేలా చేశారు. ఇక ఇది తింటే కూడా అనేక లాభాలు ఉన్నాయి… ఈ ఆకు తింటే తెల్లరక్త కణాలు, లింపోసైట్లను విపరీతంగా పెరుగుతాయి,తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అందుకే దీనికి ఇంత విలువ ఇచ్చారు.
|
|
తమలపాకు పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ఎందుకు వాడతారో తెలుసా
-