పైల్స్ అనే మాట మనం వింటూ ఉంటాం, చాలా మంది వీటితో ఇబ్బంది పడుతూ ఉంటారు… అయితే మలద్వారం దగ్గర వచ్చే అన్ని రకాల వ్యాధులని పైల్స్ అని చెప్పలేము..మలద్వారం దగ్గర పలు రకాల సమస్యలు వస్తుంటాయని, వాటిని గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే దానికి పరిష్కారం దొరుకుతుంది అని చెబుతున్నారు వైద్యులు, సో వైద్యులు చెప్పేదాని ప్రకారం
ఈ పైల్స్ సమస్య అంటే ఏమిటి అనేది చూద్దాం
మలద్వారం దగ్గర చిన్నగా మాంసం పెరుగుతుంది అది వేలాడుతూ ఉంటుంది.. ఇలా రెండు మూడు కింద బయటకు కనిపిస్తూ ఉంటే అర్షమొలలు అంటారు అంటే పైల్స్ అని అర్ధం, ఇవి లోపలరావచ్చు లేదా బయట రావచ్చు, మీరు మలద్వారాం దగ్గర శుభ్రం చేసే సమయంలో వీటిని గుర్తించవచ్చు. అక్కడ మీకు వాపులా కనిపిస్తుంది.
చాలా మంది ఇలా మోషన్ కు వెళ్లే సమయంలో వీటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు….వారికి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది.. దీనిని ప్రాధమికంగా గుర్తించాలి.. మీకు శరీరంపై ఇలా ఏదైనా వాపుగా మలద్వారం దగ్గర వేలాడుతున్న మొలలు వస్తే వెంటనే అశ్రద్ద చేయకండి.ఈ అర్ష మొలలనే పైల్స్ అంటారు.
ReplyForward
|