మీరు ఆకుకూరలు అమ్మే వ్యక్తి దగ్గర మెంతి ఆకు ఉంటే తీసుకోండి… ఎందుకంటే దీని వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది…మెంతి ఆకుకూర వల్ల ఎలాంటి సమస్యలు రావు…ఇది వారానికి ఓసారి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
మెంతికూరలో అతి విలువైన పోషకాలు వుంటాయి.ఇక మెంతులు ఎంత మంచి చేస్తాయో మెంతి కూర కూడా అంతే మేలు చేస్తుంది.
ఇక మీరు ఈ విత్తనాలు చల్లితే మెంతి ఆకు వచ్చేస్తుంది, అది వాడుకున్నా మంచిదే, ఇక ఆకు ఎండబెట్టి వండుతూ ఉంటారు అది కూడాకొన్ని వంటల్లో వాడతారు అది మంచిదే, ఇక చలికాలం చాలా మంది దీనిని తింటారు ఇది చాలా మంచిది.
ఆడవారిలో ఎక్కువగా కనిపించే నడుము నొప్పి. మెంతికూర తినడం వల్ల తగ్గుతుంది.
అంతేకాదు లివర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గ్యాస్, పేగుల్లో ఏర్పడే సమస్యలు తొలగిస్తుంది. శ్వాస కోస వ్యాధుల్ని తగ్గుస్తుంది. మలబద్దకం సమస్య ఉండదు, ఇక ఐరెన్ అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది, షుగర్ సమస్య ఉన్నవారు కూడా దీనిని తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ReplyForward
|