నాగ్ నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ చిత్రం నాగార్జున ఏమన్నారంటే

నాగ్ నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ చిత్రం నాగార్జున ఏమన్నారంటే

0
85
ఉప్పెన చిత్రం ఎంత హిట్ అయిందో తెలిసిందే, మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో ప్రత్యేక గుర్తింపు
సంపాదించుకున్నారు… లవ్ స్టోరీగా ఈ చిత్రం వెండితెరపై సూపర్ హిట్ అయింది. వైష్ణవ్ తేజ్ కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు
ఈ సినిమాలో… ఆయన నటన అద్బుతం అంటున్నారు… ఎందుకు అంటే తొలి చిత్రమైనా ఎక్కడా తడబడకుండా ఆయన నటించారు..తాజాగా టాలీవుడ్ లో అన్నపూర్ణ బ్యానర్ లో ఆయన ఓ చిత్రం చేయనున్నాడు  అనే వార్తలు వినిపించాయి.
నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో వైష్ణవ్ తేజ్  సినిమా చేయనున్నాడనే వార్తలు చాలా వినిపించాయి..
అయితే ఈ స్టోరీ నచ్చడంతో నాగార్జున ఈ సినిమా తీయాలి అని భావిస్తున్నారు అని కొద్ది రోజులుగా ప్రచారం సాగింది.
దీనిపై నాగార్జున మాట్లాడారు.
నాగార్జున హీరోగా వైల్డ్ డాగ్ సినిమా రూపొందింది.నాగార్జున ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు… తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు,  వైష్ణవ్ తేజ్ సినిమా గురించి మాట్లాడుతూ  ఈ సినిమా స్టోరీ బాగుంది దీనిపై చర్చలు జరుగుతున్నాయి
ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడని అన్నారు. దీనిపై త్వరలో ప్రకటన ఉంటుంది అని తెలిపారు కింగ్.