వైద్యులు దేవుడితో సమానం అందుకే వారికి చేతులెత్తి మొక్కుతాం… ప్రాణాలు పోతున్నా వైద్యం చేసి కాపాడతారు వైద్యులు.
ఇప్పుడు చెప్పే ఘటన వింటే ఆశ్చర్యం కలుగుతుంది..తూర్పు రష్యాలోని బ్లాగోవేషెన్క్స్ పట్టణంలో ఓ ఆసుపత్రి పై భాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదే సమయంలో ఓ రోగికి గుండె ఆపరేషన్ చేస్తున్నారు.. ఈ సమయంలో ఆ రోగిని వేరే చోటుకి మార్చలేని పరిస్దితి.
ఓవైపు అగ్నిప్రమాదంతో ఆసుపత్రిలో మంటలు దట్టంగా వ్యాపిస్తున్నాయి, ఆపరేషన్ సగంలో ఉంది… దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ మంటలు ఆర్పేందుకు శ్రమించాయి, ఆపరేషన్ థియేటర్ లోకి మంటలు, పొగ వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ ఎలక్ట్రిక్ కేబుల్ సాయంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూశారు. దీంతో ఆపరేషన్ థియేటర్ కి మంటలు అంటుకోలేదు.
చివరకు ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా చేశారు వైద్యులు, మొత్తం 8 మంది వైద్యులు ఈ ఆపరేషన్ పూర్తి చేశారు..ఈ ఆసుపత్రి 1907లో నిర్మించారు . ఆసుపత్రి పైభాగంలో కలపను అధికంగా ఉపయోగించారు అందుకే మంటలు అంటుకున్న వెంటనే మరింత పెద్ద ప్రమాదం జరిగింది….మొత్తానికి ఈ వైద్యులు చేసిన పనికి దేశం అంతా శభాష్ అంటున్నారు.