పసివాడికి మూడు పురుషాంగాలు – ప్రపంచంలో తొలికేసు – ఏం చేశారంటే

పసివాడికి మూడు పురుషాంగాలు - ప్రపంచంలో తొలికేసు - ఏం చేశారంటే

0
90

ఈ ప్రపంచంలో ఏ పురుషుడికి అయినా ఒక్క పురుషాంగం ఉంటుంది, అయితే ఇరాక్ లో అప్పుడే పుట్టిన ఓ బాబుకి మూడు పురుషాంగాలు ఉన్నాయి… వైద్య చరిత్రలో ఇది సరికొత్త కేసు అంటున్నారు…ఇప్పటి వరకూ ఇలా ఎవరూ జన్మించలేదు అంటున్నారు వైద్యులు.

 

దుహాక్ చెందిన ఓ మహిళ ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చింది… బిడ్డకు మూడు నెలలు నిండిన తర్వాత తల్లిదండ్రులు ఆ బిడ్డను బాగ్దాద్ హాస్పిటల్లోని ఓ హాస్పిటల్కు తీసుకొచ్చారు. అక్కడ బాబుకి వృషణాల సంచి ఉబ్బి ఉంది వెంటనే వైద్యులు పరీక్షలు చేశారు. అయితే ఆ బాలుడికి వంశపారపర్యంగా వస్తున్న జన్యు క్రమరాహిత్య సమస్య వల్ల ఇలా జరిగి ఉంటుంది అని తెలిపారు.

 

ఇలా మూడు అంగాలు కలిగి ఉండటాన్ని ట్రిఫాలియా అంటారు. ఆ రెండు అంగాలను సర్జరీతో తొలగించారు వైద్యులు..ఈ కేసుని స్టడీ కోసం రికార్డు చేశారు, ప్రపంచంలో ఇలా జన్మించిన తొలి బాలుడు ఇతనే అని తెలిపారు వైద్యులు. అయితే అతనికి ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలిపారు.