గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారి ‘ట్రూ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల..!!

-

గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ కేఆర్ గారు నిర్మించిన ‘ట్రూ’ మూవీ పోస్టర్ లాంచ్ ప్రముఖులు టి.ఎన్ ఆర్ గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లో హీరో హరీష్ వినయ్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గారు, డైరెక్టర్ శ్యామ్ మండల గారు మరియు ఈ మూవీ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మణికంఠ గారు పాల్గొన్నారు.

- Advertisement -

పోస్టర్ లాంచ్ చేసిన టి.ఎన్ ఆర్ గారు ఈ ట్రూ సినిమా గురించి మాట్లాడుతూ ” ఈ ట్రూ సినిమా ని అమ్మమ్మ గారిల్లు ప్రొడ్యూసర్ కేఆర్ గారు నిర్మించారు. మంచి టేస్ట్ ఉన్న నిర్మాత అయన. ఎక్కడా కాంప్రమైస్ కాకుండా ఈ సినిమా ని నిర్మించారు. ఈ సినిమా లో నేనొక మంచి రోల్ ప్లే చేశాను. ఈ సినిమా దర్శకుడు శ్యామ్ మండల నాకు బాగా పరిచయం. ఈ మూవీ మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా తీశాడు. డెఫినిట్ గా ఈ సినిమా తర్వాత పెద్ద దర్శకుడు అవుతాడు మరియు ఈ సినిమా లో హీరో, హీరోయిన్ లు హరీష్ వినయ్, లావణ్య లు చాలా బాగా చేశారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది ” అంటూ ట్రూ మూవీ టీమ్ కి బెస్ట్ విషెస్ చెప్పారు.

హీరో హరీష్ వినయ్ మాట్లాడుతూ ” బైలంపుడి నా మొదటి సినిమా, ఈ ట్రూ మూవీ నా సెకండ్ మూవీ. నా మీద నమ్మకముంచి నన్ను హీరోగా ఎంపిక చేసుకున్నందుకు ప్రొడ్యూసర్ కేఆర్ గారికి, డైరెక్టర్ శ్యామ్ మండల గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అలాగే పోస్టర్ లాంచ్ చేయడానికి వచ్చిన టి.ఎన్ ఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.. .

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు పామరాజు మాట్లాడుతూ ” ఈ ట్రూ మూవీ కి నిర్మాణ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూ ఎడిటింగ్ కూడా నేనే చేశాను. బేసికల్ గా నేను ఎడిటర్ ని. ఈ ట్రూ మూవీ కాన్సెప్ట్ నచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను” అంటూ ఈ సినిమా పోస్టర్ లాంచ్ చేయడానికి వచ్చిన టి.ఎన్ ఆర్ గారికి మా ట్రూ మూవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

డైరెక్టర్ శ్యామ్ మండల గారు మాట్లాడుతూ ” నాకు దర్శకుడిగా ఈ ట్రూ మూవీ మొదటి సినిమా.. నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాకీ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కేఆర్ గారికి మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ట్రూ మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఎక్కడా డీవియేట్ అవకుండా హోల్ మూవీ ఎంగేజింగ్ గా రన్ అవుతుంది. డెఫినిట్ గా ట్రూ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని నా నమ్మకం.. ఇక ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ పిలవగానే రావడానికి ఒప్పుకున్న మా శ్రేయోభిలాషి టి.ఎన్ ఆర్ గారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక కృతజ్ఞతలు” అంటూ ముగించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...