ఖమ్మంలో షర్మిల సభకు ముఖ్య అతిథి ఎవరంటే ?

ఖమ్మంలో షర్మిల సభకు ముఖ్య అతిథి ఎవరంటే ?

0
92

తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే….ఈ నెల 9న కోవిడ్ నిబంధనల ప్రకారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్లో వైఎస్ షర్మిల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు…. ఇక హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి షర్మిల ర్యాలీగా వెళతారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

ఈ సభకు తల్లి హోదాలో వైఎస్ విజయలక్ష్మి హాజరవుతారని షర్మిల అనుచరులు చెబుతున్నారు…. ఇక వార్తలు అయితే వినిపిస్తున్నాయి… దీనిపై ఇంకా ఎక్కడా ప్రకటన అయితే రాలేదు.. ఇక తెలంగాణలో రాజన్న రాజ్యం స్ధాపించాలి అనే ఆశతో షర్మిల ఉన్నారు…. ఖమ్మంలో సభ ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ నుంచి పార్టీ పేరును ప్రకటించనున్నారు.

 

 

ఖమ్మంలోని షర్మిల సభకు ఆమె అనుచరులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు…. ఇక హైదరాబాద్ నుంచి ఆమె ఖమ్మం చేరుకునే ప్రాంతాల్లో భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారట…ఖమ్మం పెవిలియన్గ్రౌండ్లో షర్మిల సభ నిర్వహిస్తారు, అయితే కరోనా కేసులు పెరుగుతున్న వేళ జాగ్రత్తలు తీసుకుని ఈ సభ నిర్వహించనున్నారు.