పప్పధాన్యాలు తింటున్నారా కల్తీ ఇలా చిటికెలో గుర్తించండి

పప్పధాన్యాలు తింటున్నారా కల్తీ ఇలా చిటికెలో గుర్తించండి

0
99

మార్కెట్లో చాలా మంది పప్పులు కొంటూ ఉంటారు… అయితే మనకు తెలిసిందే.. పప్పు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే… అయితే గ్యాస్ సమస్యలు లేకుండా రెండు మూడు రోజులకి ఓ సారి తీసుకోవాలి అని వైద్యులు చెబుతారు..

అయితే ఇటీవల కొందరు అక్రమార్కులు ఈ పప్పులని కూడా పాలిష్ చేసే సమయంలో దానికి రంగులు కలుపుతున్నారు,

దీని వల్ల అవి మంచి కలర్ లో కనిపిస్తాయి.

 

ముఖ్యంగా పెసర మినపప్పు కందిపప్పు వీటికి ఇలా రంగులు కలుపుతున్నారు… ఇవి నేరుగా చాలా మంది మహిళలు వేపుళ్లు తాళింపులు పోపులకి వాడుతున్నారు.. ఈ కలర్ కూడా మన కడుపులోకి వెళుతుంది.. ఇందులో ఉండే రసాయనాలు మనకు ఎంతో చేటు చేస్తాయి.

 

 

పప్పు మిల్లులపై దాడులు నిర్వహించి అధికారులు పెసరపప్పు, కందిపప్పు శాంపిల్స్ను స్వాధీనం చేసుకుంటున్నారు..

కలర్స్ కలిపిన పప్పులు తింటే అనేక దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.. కొందర ప్యాకింగ్ లో ఆకర్షణీయంగా కనిపించడానికి ఇలా చేస్తున్నారు… అయితే ఇలా కలర్ కలిసిన వస్తువులు మీరు గుర్తిస్తే నేరుగా ఫుడ్ సేఫ్టీ

డిపార్ట్ మెంట్ వారికి కంప్లైంట్ ఇవ్వండి…. అయితే ఇది కల్తీ ఎలా గుర్తించాలి అంటే, మీరు నీటిలో వేసిన సమయంలో అది కలర్ వస్తే వెంటనే అందులో కలర్స్ రసాయనాలు కలిపినట్టే….నార్మల్ గా నీరు ఉంటే అది మంచి పప్పు అని అర్దం.