వకీల్ సాబ్ కి పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

వకీల్ సాబ్ కి పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

0
133

ఏప్రిల్ 9 న వకీల్ సాబ్ సినిమా వెండి తెరపై రానుంది… ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ గురించి ఎన్నో వార్తలు ఇప్పటికే వచ్చాయి.. అయితే మూడేళ్ల తర్వాత సినిమా వస్తోంది.. మరి తాజాగా వకీల్ సాబ్ కు ఎంత రెమ్యునరేషన్ వచ్చింది అనే వార్తలు చాలా వినిపించాయి, అయితే పింక్ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో దాదాపు పవన్ 52 నిమిషాలు కనిపిస్తారు అని తెలుస్తోంది.

 

 

హిందీ పింక్ లో అమితాబ్ 40 నిమిషాలే ఉంటాడు. తమిళంలో నేర్కొండ పార్వై సినిమాలో అజిత్ కూడా తక్కువ సేపే ఉంటాడు. కాని తెలుగులో పవన్ కల్యాణ్ దాదాపు 52 నిమిషాలు తెరపై సందడి చేస్తారట, తొలి గంట కాకుండా తర్వాత నుంచి పవన్ ఎంట్రీ ఉంటుంది అని తెలుస్తోంది.

 

ఇక ఇందులో ఇరవై నిమిషాలు పవన్ కల్యాణ్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఉంటాయట, అయితే పవన్ కు ఈ సినిమాకి దాదాపు 50 కోట్ల రెమ్యునరేషన్ అందింది అని వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.. ఈ వార్తలు ప్రచారం అవుతున్నాయి.. అంటే సుమారు నిమిషానికి కోటి రూపాయల రెమ్యునరేషన్ అని అంటున్నారు అభిమానులు.. ఇది టాలీవుడ్ లో రికార్డ్ అంటున్నారు ఫ్యాన్స్ ..