మానవ మృగాలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో కొన్ని ఘటనలు వింటుంటే కన్నీరు వస్తోంది, యూపీలో దారుణం జరిగింది, రాత్రి సమయంలో ఇంట్లో అందరూ పడుకున్నారు, కోడలు ఆరునెలల గర్భవతి ఇక అత్తగారు ఆమె ఇంట్లో పడుకున్నారు, ఈ సమయంలో మత్తు నిద్రలో ఉండగా కోడలు ఏడుపులు నొప్పి ఆమెకి వినిపించి లేచి చూసేసరికి, ఆమెపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేస్తున్నాడు.
ఆ కోడలు బాధతో కేకలు వేస్తోంది ఆమె మెడపై కత్తి పెట్టి చంపేస్తాను అని బెదిరించి ఇలా అత్యాచారం చేశాడు, వెంటనే ఆమె కేకలు వేసింది స్ధానికులు వస్తున్నారు అనే భయంతో అతను అత్తపై దాడి చేసి అక్కడ నుంచి పారిపోయాడు, వెంటనే ఆమెని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ఈ ఘటన ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది.మహరాజ్‌గంజ్ జిల్లా పనియారా గ్రామంలో ఈ దారుణం జరిగింది, అతనిపై కేసు పెట్టారు అత్తా కోడల్లు…. అయితే పోలీసులు విచారణలో తేలింది ఏమిటి అంటే ఎదురింటి వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు అని తెలుస్తోంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.