భర్త దగ్గరకు తీసుకువెళతానని చెప్పి వ్యభిచారం చేయించాడు – దారుణం

భర్త దగ్గరకు తీసుకువెళతానని చెప్పి వ్యభిచారం చేయించాడు - దారుణం

0
125

ఆ భార్య భర్తతో గొడవపడింది, ఆమె వయసు 21 ఏళ్లు ఆమెకి ఓ పాప కూడా ఉంది, అయిదే గత ఏడాది భార్య భర్తలకు ఓ విషయంలో గొడవ జరిగింది.. ఇక కూతురిని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది, ఇక ఆమె ఇక్కడ ఉంటున్న విషయం తెలుసుకుని అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తి నీ భర్త నిన్ను తీసుకురమ్మన్నాడు అని ఆమెకి చెప్పాడు. ఆమె అతని మాటలు నమ్మి అతనితో వెళ్లింది.

 

పలుమార్లు రాఖీ కట్టడంతో సోదరుడిగా భావించి కుమార్తెను తీసుకుని అతడి వెంట మరో ఆలోచన లేకుండా హైదరాబాద్ బయలుదేరింది. ఓ గది అద్దుకు తీసుకుని ఆమెని హైదరాబాద్ లో ఉంచాడు..నీ భర్త వస్తాడు అని ఆమెకి చెప్పాడు.. ఆమె అతనిని నమ్మింది ,రెండ్రోజుల తర్వాత అనుమానం వచ్చింది. ఆమె నుంచి 5 తులాల నగలను లాక్కున్నాడు. తీవ్రంగా కొట్టాడు సిగరెట్లతో వాతలు పెట్టాడు.

 

తన రెండేళ్ల కుమార్తె వీపుపైనా సిగరెట్లతో కాల్చి తీవ్రంగా హింసించాడు…నేను చెప్పింది చేయాలి అని బెదిరించాడు.. లేదా కుమార్తెని చంపుతా అన్నాడు… చివరకు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం చేయించాడు.. ఇలా ఇంటికి చాలా మందిని తీసుకువచ్చాడు, దీంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి ఓ రోజు తాళం బద్దలు కొట్టి చూస్తే లోపల ఆమె ఏడుస్తూ సాయం కోసం చూస్తోంది… వెంటనే ఆమెకి కొంత నగదు సాయం చేసి ఆమెని పంపించేశాడు. ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది.