బ్రేకింగ్ – తిరుపతి బై పోల్ 14న సీఎం జగన్ ప్రచారం సభ అక్కడే ఉంటుందా ?

బ్రేకింగ్ - తిరుపతి బై పోల్ 14న సీఎం జగన్ ప్రచారం సభ అక్కడే ఉంటుందా ?

0
104

తిరుపతిలో బైపోల్ వార్ గురించే ఎక్కడ చూసినా చర్చ.. ముందుగా ఇక్కడ ప్రధాన పార్టీలు అన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి, ఇక బీజేపీ జనసేన, టీడీపీ వైసీపీ ఇలా పార్టీలు అభ్యర్దులని ప్రకటించారు.. అంతేకాకుండా ప్రచారం హోరెత్తించారు, ఇక తాజాగా ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ కూడా తిరుపతి బై పోల్ ప్రచారానికి వస్తారు అనే వార్తలు పొలిటికల్ కారిడార్ లో వినిపిస్తున్నాయి.

 

ఈ నెల 14వ తేదీన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. రేణిగుంట సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారట, అయితే దీనిపై ఇంకా పూర్తి షెడ్యూల్ అయితే రాలేదు, ఈనెల 17న తిరుపతి ఉప ఎన్నిక జరుగనుంది.

వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి భారీ మెజార్టీ లక్ష్యంగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

 

ఇక కచ్చితంగా గతంలో కంటే భారీ మెజార్టీ వస్తుంది అని ధీమాగా ఉన్నారు, అయితే ఇక్కడ సీఎం జగన్ ప్రచారం చేస్తే మరింత ప్లస్ అవుతుంది అని నేతలు భావించారు.. అందుకే సీఎం జగన్ ఇక్కడకు వస్తారని వార్తలు వస్తున్నాయి.

రేణిగుంట మండలం ఎల్లమండ్యంలోని యోగానంద కళాశాల సమీపంలో బహిరంగ సభకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు.

 

వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి

బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ

టీడీడీ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారం చేస్తున్నారు.