తెలుగు తమిళ సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు కార్తీక్ అందరికి తెలిసిన వ్యక్తే …ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు, అగ్ర దర్శకులు నిర్మాతలతో కార్తీక్ పని చేశారు… అయితే ఆయన రాజకీయంగా కూడా చాలా యాక్టీవ్ గా ఉంటారు…తమిళనాడులోని మనిద ఉరిమై కాక్కుమ్ కట్చి పార్టీ పెట్టారు, అయితే ఇటీవల ఆయన అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే …కోలుకుని ఆయన ఇంటికి చేరారు.
మళ్లీ అనారోగ్యంగా ఉండటంతో ఆయనని ఆస్పత్రిలో చేర్పించారు.. మార్చి 21న కార్తీక్ తీవ్ర శ్వాసకోశ సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అడయార్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి కొద్ది రోజులపాటు చికిత్స తీసుకున్నారు.ఇక ఇంటికి వచ్చారు, అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా అన్నాడీఎంకే పార్టీకి మద్దతు ఇచ్చారు.
కొన్ని నియోజకవరాల్లో ప్రచారం చేసి చెన్నై వచ్చారు. కొద్ది రోజులకే మళ్ళీ ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో వెంటనే ఆయనని ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు …ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ వార్త విని ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు.