మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో వస్తున్న కేసుల్లో సగం కేసులు ఇక్కడ నుంచి నమోదు అవుతున్నాయి, భారీగా కేసులు వస్తున్నాయి, ఇక దేశ ఆర్దిక రాజధాని ముంబైలో భారీగా కేసులు బయటపడుతున్నాయి.
కేసులు భారీగా రావడంతో మహారాష్ట్రలో మినీ లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కరోనా చెలరేగిపోవడంతో కరోనా నియంత్రణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇక దేశంలో ఎక్కువగా సీరియళ్లు షూటింగ్ ఇక్కడ జరుగుతాయి.. దీంతో కేసులు పెరగడంతో ప్రభుత్వం
ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి ఇక షూటింగులు జరగవు, అయితే హోటల్స్ షాపింగ్ మాల్స్ థియేటర్లు ధార్మీక ప్రాంతాలు దర్శనీయ ప్రాంతాలు అన్నీ క్లోజ్ చేశారు.
దీంతో బీ టౌన్ లో వివిధ టీవీ సీరియళ్ల షూటింగ్ నిలిచిపోనుంది.ఉదయం పూట సెక్షన్ 144, రాత్రి సమయంలో కర్ఫ్యూతోపాటు వీకెండ్లో అంటే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు సంపూర్ణ లాక్డౌన్ను విధించింది.
రోజుకి దాదాపు 45 వేల వరకూ కేసులు నమోదు అవుతున్నాయి.