కారు పార్క్ చేయడానికి ఈ మహిళ కష్టాలు చూడండి – వీడియో ట్విస్ట్ ఇదే

కారు పార్క్ చేయడానికి ఈ మహిళ కష్టాలు చూడండి - వీడియో ట్విస్ట్ ఇదే

0
89

చాలా మంది కారు బాగానే నడుపుతారు.. ఘాట్ రోడ్లు అలాగే పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఈ కారు పెద్దది అయితే ఇక వారి బాధ అంతా ఇంతా కాదు ..ఉన్న చిన్న ప్లేస్ లో పార్కింగ్ చేయడానికి ఎంతో సేపు సమయం పడుతుంది.. దానికి మళ్లీ ఎలా పార్క్ చేయాలా అనేది కూడా ఆలోచనగా ఉంటుంది… ఇప్పుడు ఇలాంటి కారు పార్కింగ్ వీడియో వైరల్ అవుతోంది.

 

ఓ మహిళ ఇలా తన కారు పార్క్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడిందో ఈ వీడియో చూస్తే అర్దం అవుతుంది.

ఓ యువతి తన కారును మరో రెండు కార్ల మధ్య ప్యారలల్ పార్కింగ్ చేయడం కోసం నానా కష్టాలు పడింది. పాపం కిందకి దిగి ఆ కారుకి గ్యాప్ ఎంత ఉంది స్పేస్ లో కారు సరిపోతుందా అనేది కూడా చూసుకుంది

 

ఆమె పడుతున్న కష్టాన్ని చూసిన మరో మహిళ సాయం చేసింది. కారును పార్కింగ్ చేసేందుకు సంకేతాలు ఇచ్చింది.మొత్తానికి ఈ కారు పార్కింగ్ చేసింది, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వెనుక ఉన్న కారు ఆ సాయం చేసిన మహిళదే, అయితే ఇది సరదా కోసం చేశారా నిజమేనా అని అందరూ కామెంట్లు పెడుతున్నారు.

 

మరీ మీరు ఆ వీడియో చూడండి.