చిరుతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న బాబీ- టైటిల్ పై టాలీవుడ్ టాక్

చిరుతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న బాబీ- టైటిల్ పై టాలీవుడ్ టాక్

0
84

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు.. ఆయన ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. మరో రెండు చిత్రాలు కూడా ఒకే చేశారు.. ఇక ఆచార్య కొరటాలతో చేస్తున్నారు.. ఈ చిత్రం మే 13 న థియేటర్లో విడుదల కానుంది, ఇక ఈ సినిమా తర్వాత వెను వెంటనే లూసిఫర్ వేదాళం చిత్రాలు రీమేక్ చేయనున్నారు.

 

ఈ చిత్రాలకు మోహన్ రాజా, మెహర్ రమేష్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ బాబీతో ఆయన సినిమా చేయనున్నారు… ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రం చేయనుంది.. ఇక దర్శకుడు బాబీ ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు, అన్నీ సెట్ అయితే వచ్చే ఏడాది మధ్యలోనే ఈ చిత్రం స్టార్ట్ అవచ్చు.

 

ఈ సినిమాను బాబీ కోర్ట్ డ్రామాగా తెరకెక్కించనున్నారని, ఠాగూర్ మాదిరిగా సమాజంలో జరిగే లోపాల్ని ఎత్తి చూపే కథగా ఉంటుందని టాక్. అంతేకాదు ఈ సినిమా విలేజ్ బ్యాగ్రౌండ్ లో ఉంటుంది అని తెలుస్తోంది. వీరయ్య అనే టైటిల్ కూడా వైరల్ అవుతోంది.