2 గంటల్లో చనిపోతాడు అనగా అభిమాని కోసం ప్రభాస్ ఏం చేశారంటే – హార్ట్ టచింగ్

2 గంటల్లో చనిపోతాడు అనగా అభిమాని కోసం ప్రభాస్ ఏం చేశారంటే - హార్ట్ టచింగ్

0
86

అసలు అభిమానులు లేకపోతే హీరోలు ఉండరు, అందుకే అభిమానులపై ఎంతో ప్రేమ చూపిస్తారు హీరోలు, వారికి ఎలాంటి కష్టం వచ్చినా తెలిస్తే సాయం చేస్తారు.. ఇలా మన తెలుగు చిత్ర సీమలో ఎందరో స్టార్ హీరోలు తమ మంచి మనసు చాటుకున్నారు. తాజాగా ప్రభాస్ తన అభిమాని కోసం చేసిన పని ఇప్పుడు కాస్త లేట్ గా తెలిసింది, మరి అది ఏమిటో చూద్దాం.

 

భీమవరం సమీపంలోని వెంప కాశీ అనే ఒక వ్యాపారవేత్త ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అది ప్రభాస్ మిర్చి సినిమా చేస్తున్న సమయం.వెంప కాశీ కజిన్ కొడుకు సడన్ గా కళ్లు తిరిగి పడిపోయాడు. కొన్ని చెకప్స్ తరువాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు తీసుకువెళ్ళారట, ఇక అతను కాన్సర్ లాస్ట్ స్టేటజ్ లో ఉన్నాడు పది రోజుల్లో చనిపోతాడు అని చెప్పారట వైద్యులు, దీంతో ఆ అబ్బాయి నన్ను ప్రభాస్ సినిమా షూటింగ్ కు తీసుకువెళ్లండి అని కోరాడు… ఇక మందులు వాడు కొంచెం కోలుకున్నాక తీసుకువెళతాం అని చెప్పారట, ఈ సమయంలో ఆయనకు తెలిసిన వారికి అందరికి చెప్పి ప్రభాస్ తో మాట్లాడాలి అని ట్రై చేశారు కాని కుదరలేదు.

 

డాక్టర్లు బాబు ఇంకా 2గంటల్లో చనిపోవచ్చని అన్నారు. చివరకు అతని కోరిక తీర్చాలి అని మరోసారి తెలిసిన వారిని బతిమలాడాను. ఆ సమయంలో ప్రభాస్ కు ఈ విషయం తెలిసి మిర్చి షూటింగ్ నుంచి అలాగే వచ్చేశారు, ఆ అబ్బాయితో గంట సేపు మాట్లాడారు…అతన్ని ముద్దు కూడా పెట్టుకున్నాడు. నేను వెళ్ళిపొమ్మంటే గాని ప్రభాస్ వెళ్లిపోలేదు. ప్రభాస్ వచ్చాడు అని ఆ ఆనందంలో ఆ బాబు మరో 20 రోజులు బతికాడు, ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో తెలియచేశారు ఆయన.