నటి సితార ఎందుకు వివాహం చేసుకోలేదో తెలుసా

నటి సితార ఎందుకు వివాహం చేసుకోలేదో తెలుసా

0
93

నటి సితార అంటే తెలియని వారు ఉండరు… ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు, ముఖ్యంగా ఆమె అమ్మ పాత్రలు వదిన పాత్రలు చెల్లెలి పాత్రలు చేస్తున్నారు… తెలుగులో ఇటీవల చాలా మంది స్టార్ హీరోలకు తల్లిగా వదినగా కూడా నటించారు, ఎన్నో కమర్షియల్ సినిమాల్లో ఆమె నటిస్తున్నారు..

 

ముందు హీరోయిన్గా గుర్తింపు సాధించుకున్న ఆమె కాస్త బ్రేక్ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. ఇక దర్శక నిర్మాతలు ఆమెకి అనేక అవకాశాలు ఇస్తున్నారు సినిమాల్లో… అయితే ఆమె నిజజీవితంలో మాత్రం వివాహం చేసుకోలేదు.. ఇది చాలా మందికి తెలియదు.. 47 ఏళ్లు వచ్చినా ఆమె ఇంకా సింగిల్గా ఉండటం వెనుక కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

 

సితార కేరళలోని కిలిమానూర్ ప్రాంతంలో 1973, జూన్ 30న జన్మించారు. కాలేజీ స్టడీ సమయంలోనే ఆమె చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చారు, అయితే ఆమె వివాహం ఎందుకు చేసుకోలేదు అంటే ఆమె కి అన్ని విషయాల్లో తండ్రి తోడుగా ఉండేవారు.. కాని ఆయన మరణించిన తర్వాత షాక్లోకి వెళ్లిపోయారు సితార… దీంతో కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరమయ్యారు. అలా చూస్తుండగానే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. దీంతో ఇక వివాహం గురించి పట్టించుకోలేదు అని ఆమె తెలిపారు.