కరోనా కేసులు పెరగడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం – ఈ పని చేస్తే భారీ ఫైన్

కరోనా కేసులు పెరగడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం - ఈ పని చేస్తే భారీ ఫైన్

0
88

కొందరు ఇన్ని కరోనా కేసులు వస్తున్నా మాస్కులు ధరించడం లేదు.. దీంతో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటున్నారు కొందరు. అస్సలు భౌతిక దూరం పాటించడం లేదు.. మాస్కులు శానిటైజర్లు పక్కన పడేశారు ..ఇదే ఇప్పుడు పెను విపత్తుగా మారింది, అయితే ఇలా నిబంధనలు ఇక కచ్చితంగా పాటించాల్సిందే ఇష్టం వచ్చినట్లు రోడ్ల పై ఉమ్మువేసినా భారీగా ఫైన్ కట్టాల్సిందే.

 

తాజాగా, రైల్వే శాఖ కోవిడ్ నిబంధనలపై కీలక ఆదేశాలు జారీచేసింది. రైళ్లు, రైల్వే స్టేషన్లలోనూ మాస్క్ ధరించకపోయినా, ఉమ్మినా జరిమానా కట్టాల్సిందేనని స్పష్టం చేసింది.రైలు ఎక్కడానికి ఎవరు వచ్చినా రైల్వేస్టేషన్ లో ట్రైన్ దిగిన వారు అయినా ఎవరు అయినా రైల్వే స్టేషన్ అలాగే పరిసరాల్లో ఉమ్మితే కచ్చితంగా 500 జరిమానా కట్టాల్సిందే.

 

ఈ ఆదేశాలు ఆరు నెలల వరకూ అమలులో ఉంటాయని తెలిపింది. ఇక మాస్కు లేకపోయినా ఉమ్మి ఉమ్మినా 500 జరిమనా విధిస్తారు, అక్కడ ఉన్న అధికారులు ఈ ఫైన్లు విధిస్తారు… ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది రైల్వేశాఖ.