తెలంగాణ నైట్ కర్ఫ్యూ – ఏవి ఓపెన్ ఏవి క్లోజ్

తెలంగాణ నైట్ కర్ఫ్యూ - ఏవి ఓపెన్ ఏవి క్లోజ్

0
80

తెలంగాణలో ఈ రోజు నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది..

రాత్రి 9 నుంచి ఉదయం ఐదు గంటల వరకూ రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు, భారీగా కేసులు నమోదు అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

అయితే ఏవి ఉంటాయి ఏవి ఉండవు దేనికి మినహాయింపు అనేది చూద్దాం

తెలంగాణలో అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, వ్యాపారాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలని జీవోలో పేర్కొన్నారు.

 

ఇక ఉండేవి చూద్దాం.

ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్లు, మందుల దుకాణాలు, అంబులెన్స్ సర్వీసులు

మీడియా, పెట్రోల్ బంకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు,

ఈ-కామర్స్ సర్వీసులు, మెడికల్ షాపులకు మినహాయింపులు ఇచ్చింది ప్రభుత్వం.

 

ఇక ఏవి క్లోజ్ అనేది చూద్దాం

బార్లు, క్లబ్బులు,

వైన్స్, షాపింగ్ మాల్స్

 

ఏప్రిల్ 30 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.