ఈ రోజుల్లో నగరాల్లో కూడా చాలా చోట్ల వ్యభిచార ముఠాలు బయటపడుతున్నాయి… సీక్రెట్ గా అమ్మాయిలని తీసుకురావడం వారితో వ్యభిచారం చేయిస్తున్నారు.. అయితే ఎవరికి అనుమానం రాకుండా ఇలా వీరు వ్యభిచారం చేయిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ బంగ్లాదేశ్ నుంచి మహిళలను బెంగళూరు తీసుకొచ్చారు. చివరకు వారికి ఉద్యోగం ఇవ్వకుండా భయపెట్టి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు.
బెంగళూర్ లోని మహాదేవపుర లక్ష్మీసాగర లేఔట్లో ఈ ఘటణ వెలుగుచూసింది. ఇందులో ఓ ప్లాట్ తీసుకుని అక్కడ అమ్మాయిలతో ఇలా వ్యభిచారం చేయిస్తున్నారు. అయితే ప్రతీ అరగంటకు గంటకి ఇద్దరు ముగ్గురు పురుషులు వచ్చి వెళుతున్నారు. దీంతో అనుమానం వచ్చి వెంటనే స్ధానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు.
ఫ్లాట్ పై రైడ్ చేసిన పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఇందులో ఇద్దరు బంగ్లాదేశ్ అమ్మాయిలు ముగ్గురు వెస్ట్ బెంగాల్ అమ్మాయిలు ఉన్నారు… ఇక ఇద్దరు మహిళలు వీరితో ఇలా పడుపు వృత్తి చేయిస్తున్నారు.
11 నకిలీ పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.ఉద్యోగం అని చెప్పి వీరిని ఇలా ఈ వృత్తిలోకి దింపారు.