మనం ఫోన్ వాడితే అందులో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంటే రెండు సిమ్స్ వేసుకుంటాం.. లేదా ఒకటే సిమ్ వాడుతూ ఉంటాం. ఇక మన ఇంట్లో వారికి సిమ్ కావాలి అంటే మన డీటెయి్స్ ఇచ్చి ఓ సిమ్ తీసుకువస్తాం వారికి ఇస్తాం… అయితే మన పేరు మీద ఈ సిమ్ మాత్రమే ఉంది అని అనుకుంటాం.. కానీ మనకు తెలియకుండా కొందరు కేటుగాళ్లు మన డీటెయిల్స్ తో సిమ్స్ తీసుకుంటున్నారు.. పలు మోసాలకు పాల్పడుతున్నారు.
సైబర్ నేరగాళ్లు సిమ్ లు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా సిమ్ తీసుకుంటే లేని పోని ఇబ్బందులు మనకు రావచ్చు, సో ఇలా మన డీ టెయిల్స్ తో మన పేరు మీద ఎవరైనా సిమ్ తీసుకుంటే మనం ఈజీగా గుర్తించవచ్చు, మరి అది ఎలాగో చూద్దాం.
వెబ్సైట్ https://tafcop.dgtelecom.gov.in దీనిని ముందు ఓపెన్ చేయండి
ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి
వెంటనే మీకు ఓటీపీ వస్తుంది
అది ఎంటర్ చేయగానే మీకు ఈ నేమ్ తో ఎన్ని సిమ్ ల ఉన్నాయి అనేది వస్తుంది
అక్కడ మీరు వాడని నెంబర్లు ఏమైనా మీరు గుర్తిస్తే
దీనిపై రిపోర్ట్ కొట్టవచ్చు.
దీంతో ఆ నెంబర్ పై టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది
ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు మాత్రమే ఉండేందుకు వీలుంది
మీకు అనుమానం ఉంటే వెంటనే ఇలా చెక్ చేసుకోండి మీ సన్నిహితులకి పంపండి ఈ లింక్
.