ఆదివారం వచ్చిందంటే కచ్చితంగా చాలా మంది ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది.. ఇక మాంసం లేనిదే ఆ రోజు ముద్ద దిగదు, చికెన్ మటన్ ఫిష్ ఇలా అనేక రకాల వంటకాలు వండుతారు….ఇక ఆదివారం చికెన్ షాపుల ముందు జనం కూడా బారులు తీరుతారు… ఇక ఇప్పుడు కరోనా వేళ చికెన్ తింటే మంచిది అని చాలా మంది ఇమ్యునిటీ కోసం తింటున్నారు.. ఈ చికెన్ కూడా ధర భారీగా పెరిగింది.
ఆదివారం మటన్ చికెన్ షాపుల దగ్గర జనం రద్దీ ఉంటుంది….అయితే హైదరాబాద్ మహానగరంలో చికెన్ అమ్మకాలు భారీగా ఉంటాయి, ఏ మార్కెట్ చూసినా జనంతో ఉంటుంది, అయితే ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్ లో నివసించే ప్రజలు మాంసాహారాన్ని రుచి చూడలేరు. ఎందుకు అనేది చూద్దాం.
మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం గ్రేటర్ పరిధిలో కబేళాలు, మాంసం, బీఫ్ దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. కచ్చితంగా దీనిని అమలు చేయాలి అని తెలిపారు, ఎవరూ షాపులు తీయద్దు అని అధికారులు ప్రకటనలో తెలిపారు.. మళ్లీ సోమవారం మాత్రమే షాపులు తీయాల్సి ఉంటుంది.