ఆ ముగ్గురు చేసిన పనికి గ్రామం అంతా కరోనా పాకింది

ఆ ముగ్గురు చేసిన పనికి గ్రామం అంతా కరోనా పాకింది

0
98

కరోనా వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసిందే, హోమ్ ఐసోలేషన్ హోం క్వారంటైన్ లోచాలా మంది ఉంటున్నారు, ఇక వారు సాధారణంగా అందరి మధ్య తిరిగితే కేసులు మరింత పెరుగుతున్నాయి…అందుకే వారు దాదాపు పది రోజులు జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు చెబుతారు, అయితే ఓ గ్రామంలో మాత్రం ఇప్పుడు సగానికి సగం మందికి కరోనా సోకింది.

 

కర్ణాటకలోని బెళగావి జిల్లా అబనాళి గ్రామంలోని 300 మంది ఆ గ్రామంలో నివసిస్తుండగా 144 మందికి పాజిటివ్ అని తేలింది.

ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ నెల 10న ముగ్గురు వ్యక్తులు కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లారు. వారికి పాజిటీవ్ అని తేలింది జాగ్రత్తలు తీసుకోకుండా ఊరంతా ఆ ముగ్గురు తిరిగేశారు.

 

పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసోలేషన్ లోనూ ఉండలేదు. పాజిటివ్ అని తెలిసినా ఊరంతా విచ్చలవిడిగా తిరిగేశారు. వీరి వల్ల గ్రామంలో చాలా మందికి కరోనా సోకింది….దీంతో అధికారులు రంగంలోకి దిగారు….అధికారులు టెస్టులు చేస్తే ఏకంగా సగానికి సగం మందికి కరోనా అని తేలింది.