బ్రేకింగ్ – భారీగా తగ్గిన చికెన్ ధర కిలో ఎంతంటే

బ్రేకింగ్ - భారీగా తగ్గిన చికెన్ ధర కిలో ఎంతంటే

0
77

కొద్ది నెలలుగా చూస్తే ఈ చికెన్ ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.. ఈ కరోనా సమయంలో చాలా మంది చికెన్ తినడానికి ఆసక్తి చూపించారు.. ఇక దీంతో ధరలు భారీగా పెరిగాయి గుడ్లు చికెన్ ధరలు ఆకాశాన్ని అంటాయి అనే చెప్పాలి, ఇక మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.250 కంటే ఎక్కువగా ఉంది.. అయితే ఇప్పుడు మార్కెట్లో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

 

చికెన్ ధర భారీగా పడిపోయింది. వారం రోజుల క్రితం బాయిలర్ చికెన్ కిలో రూ.220 గా ఉండగా, ఇప్పుడు అది రూ.140-150కి పడిపోయింది.. ఏకంగా కిలోకి 70 వరకూ తగ్గిపోయింది, ఇదే ఇప్పుడు అందరిని షాక్ కి గురిచేస్తోంది, అయితే వ్యాపారులు డిమాండ్ ఎక్కువ ఉంది స్లపై తక్కువ ఉంది ఇంకా ధరలు పెరుగుతాయి అని ఇటీవల అన్నారు.. ఈ లోపు ధర దారుణంగా తగ్గుతోంది.

 

అలాగే, కిలో రూ.120 ఉన్న ఫామ్గేట్ ధర ఇప్పుడు రూ.80కు దిగి వచ్చింది. అయితే నాలుగు రోజులుగా చూస్తే చికెన్ వినియోగం బాగా తగ్గింది.ఎండలకు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు అనారోగ్యం పాలవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో చాలా వరకూ కూలీలు రావడం లేదు కరోనా దెబ్బకు, అందుకే తక్కువ ధరకు కోళ్లు అమ్ముతున్నారు వ్యాపారులు.