బ్రేకింగ్ – ఏపీలో నైట్ కర్ఫ్యూ తర్వాత వస్తున్నారా

బ్రేకింగ్ - ఏపీలో నైట్ కర్ఫ్యూ తర్వాత వస్తున్నారా

0
100

దేశంలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి ఈ సమయంలో ఎవరూ బయటకు రావడం లేదు, ఇక కేసులు చూస్తుంటే రోజుకి మూడున్నర లక్షలకు చేరువ అవుతున్నాయి…. మరణాలు రెండు వేలు దాటుతున్నాయి, అయితే ఇప్పటికే చాలా స్టేట్లు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి…. ఇక మహారాష్ట్ర అయితే అత్యంత దారుణంగా ఉంది భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.

 

ఇక ఏపీలో కూడా నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు, తెలంగాణతో పాటూ తమిళనాడు, కర్ణాటకలో కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏపీలో అయితే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు మినహా మిగిలినవి ఏవీ పని చేయవు. కేవలం మెడికల్ అలాగే పెట్రోల్ బంకులు మాత్రమే ఉంటాయి..

 

ఇక ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. మరి రాత్రి పది తర్వాత బస్సు దిగినా రైలు దిగినా ఏమిటి పరిస్దితి అని. అయితే కచ్చితంగా మీరు ఆటో కారులో వెళితే మీ ప్రయాణం చేసిన టికెట్ చూపించాలి. మిమ్మల్ని ఎవరైనా పికప్ చేసుకున్నా డ్రాప్ చేసినా వారు కూడా ఈ టికెట్ చూపించాలి.ఎవరైనా హెల్త్ ఎమర్జెన్సీతో సొంత వాహనాల్లో వస్తే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ చూపిస్తే సరిపోతుంది.