మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా ఆరోజు అనౌన్స్ చేస్తారా

మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా ఆరోజు అనౌన్స్ చేస్తారా

0
76

ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నారు… ఇక ఈ సినిమా గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు… ఇక సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది… అయితే తాజాగా ఈ సినిమాని దుబాయ్ లో కూడా షెడ్యూల్ చేశారు. ఇక హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

అంతేకాదు తాజాగా వినిపిస్తున్న వార్తలు చూస్తే త్రివిక్రమ్ – మహేశ్ బాబు ప్రాజెక్టును లాంచ్ చేయడానికి ముహూర్తం ఖాయమైపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.. మే 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు ఈ రోజున సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందని చూస్తున్నారు.. అభిమానులు చర్చించుకుంటున్నారు.

 

కృష్ణ పుట్టినరోజున సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కరోనా కారణంగా చాలా సింపుల్ గా ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఈ టాక్ అయితే వినిపిస్తోంది.