ఫహాద్ ఫాజిల్ మలయాళ చిత్ర సీమలో ఓ నెంబర్ వన్ యాక్టర్ గా నిలదొక్కుకున్నాడు ఈ నటుడు.. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులో చోటు దక్కించుకున్నారు ఫహాద్ ఫాజిల్….ఫహాద్ ఫాజిల్ 1982 ఆగస్టు 8 న పుట్టారు..నటుడు, చిత్ర నిర్మాత గా మలయాళ చిత్ర పరిశ్రమలో పేరు సంపాదించారు.
ఆయన దాదాపు నలభైకి పైగా చిత్రాలలో నటించారు. జాతీయ చలనచిత్ర పురస్కారం అలాగే , నాలుగు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, మూడు సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు.. ఇక చిత్ర సీమకు చెందిన వ్యక్తే ఈయన.
ఫహాద్ చిత్రనిర్మాత ఫాజిల్ కుమారుడు అనే విషయం అందరికి తెలిసిందే.
ఫహద్ మొదటి చిత్రం, కైయెతుమ్ దూరత్ ..ఈ సినిమాకి ఆయన తండ్రి, దర్శకుడు ఫాజిల్ దర్శకత్వం వహించాడు. 2014 లో ఆయన నిర్మించిన పెద్ద బడ్జెట్ చిత్రం అయోబింటే పుస్తకం లో నటించారు. అలాగే బ్లాక్ బస్టర్ మూవీ బెంగుళూరు డేస్ లో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు.
తర్వాత చేసిన సినిమా మహేషింతే ప్రతిరాకం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తర్వాత చేసిన వరాతన్, న్జన్ ప్రకాషన్, కుంబలంగి నైట్స్తో బాక్సాఫీస్ విజయాలు వచ్చాయి. ఇక ఆయన మలయాళ సినీ నటి నజ్రియా నజీమ్ని 21 ఆగస్టు 2014 న తిరువనంతపురంలో వివాహం చేసుకున్నారు. ఇక ఫహాద్ ఫాజిల్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో నటిస్తున్నారు.