కరోనా వస్తే కొందరికి జలుబు జ్వరం దగ్గు గొంతు నొప్పి వస్తున్నాయి …మరికొందరు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. ఇటీవల చాలా కేసుల్లో ఆక్సిజన్ లేక మరణాలు చూస్తున్నాం.. అయితే ఈ కరోనా మహమ్మారి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది అందువల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ వైరస్ క్రమంగా ఊపిరితీత్తుల్లోకి వెళ్లి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది. అక్కడ వైరస్ తిష్ట వేసి మనకు ఆక్సిజన్ అందకుండా చేస్తుంది….ఊపిరితీత్తులకు రక్తాన్ని అందించే నాళాలను గడ్డకట్టిస్తుంది. దీని వల్ల మన శరీరంలో ఏ అవయవానికి ఆక్సిజన్ సరఫరా వేగంగా జరగదు.
దీనివల్ల న్యుమోనియాకు దారి తీస్తుంది. ఇలా రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది ..ఈ సమయంలో ప్రమాదం గుర్తించాలి, అయితే మీరు ఇంట్లో కచ్చితంగా పల్స్ ఆక్సీమీటర్ ద్వారా గుర్తించవచ్చు..ఆక్సిజన్ శాతం 94 నుంచి 90 మధ్యన చూపిస్తుంటే శరీరానికి అదనంగా ఆక్సిజన్ అవసరమని అర్థం. మీరు వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లాలి.