టాలీవుడ్ లో హీరోయిన్ సమంతకు ఎంత గుర్తింపు ఉందో తెలిసిందే …అందరూ టాప్ హీరోలతో ఆమె సినిమాల్లో నటించారు.. అంతేకాదు అక్కినేనివారి ఇంటి కోడలుగా ఉన్నారు, ఇటు సమంత బుల్లితెరపై కూడా సందడి చేసింది, ఇటు ఓటీటీలో కూడా తన సత్తా చాటుతోంది, ఓ వైపు బిగ్ బాస్ లో కూడా గత సీజన్ లో ఆమె సందడి చేసింది.
అయితే టాలీవుడ్ లో ఆమెకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి..ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అమ్మా నాన్నల గురించి మీకు ఈ విషయాలు తెలుసా …టాలీవుడ్లో ఏమాయ చేసావే సినిమాతో అడుగుపెట్టింది సమంత. హీరో నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
సమంత నాన్న ప్రభు తెలుగు వాళ్లు. వాళ్ల అమ్మగారు నివెట్ వారిది కేరళ. కానీ సమంత వాళ్ల ఫ్యామిలీ మాత్రం చెన్నైలో స్థిరపడ్డారు…సమంత వాళ్ల అమ్మా నాన్నలకు జోనాథన్, డేవిడ్ తర్వాత సమంత మూడో సంతానంగా పుట్టారు. ఇక ఆమె మొత్తం చెన్నైలోనే చదువుకున్నారు, ఇక డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమె మోడలింగ్ చేసారు. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ అయ్యారు.