ఆ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ – టాలీవుడ్ టాక్

ఆ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ - టాలీవుడ్ టాక్

0
104

ఈ కరోనా వల్ల సినిమా పరిశ్రమ చాలా నష్టాల్లోకి వెళ్లింది, ఇక చాలా మంది కొత్త సినిమాలు ఆపేశారు, ఇక చిన్న సినిమాలు మీడియం బడ్జెట్ చిత్రాల వారు చాలా ఇబ్బంది పడ్డారు….అయితే జనవరి నుంచి కాస్త కేసులు తగ్గడంతో సినిమాలు విడుదల అయ్యాయి… అయితే మార్చి నుంచి మళ్లీ భారీగా కేసులు పెరిగాయి… దీంతో ఇప్పుడు మళ్లీ సినిమా థియేటర్లు క్లోజ్ అయ్యాయి.

 

అయితే చాలా మంది హీరోలు మాత్రం ఈ సమయంలో కొత్త కథలు వింటున్నారు, మరి తాజాగా లాక్ డౌన్ తర్వాత రవితేజ చాలా ప్రాజెక్టులు ఒకే చేశారు… ఇది ఆయన అభిమానులకి చాలా ఆనందం కలిగిస్తోంది..ముఖ్యంగా క్రాక్ సినిమాతో ఈ ఏడాది ఆయన భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నారు.

 

ఇక తర్వాత తన ప్రాజెక్టులు సెట్స్ పై పెడుతున్నారు.. ఈ సినిమా తర్వాత ఆయన ఖిలాడి చిత్రం ఒకే చేశారు.. ఇప్పుడు సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగింది ఈ రెండు చిత్రాల తర్వాత

త్రినాథరావు నక్కిన .. శరత్ మండవ దర్శకత్వంలోని సినిమాలను లైన్లో పెట్టేశాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత మరో సినిమా ఒకే చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

 

రవితేజ కెరియర్ లో రాజా ది గ్రేట్ ఈ సినిమా ఎంతో పేరు తీసుకువచ్చింది… ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు ఈ సినిమా కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట…ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ చేస్తున్న అనిల్ రావిపూడి, తాజాగా రాజా ది గ్రేట్ సీక్వెల్ స్టోరీ చెప్పారట, నచ్చడంతో రవితేజ ఒకే చెప్పారు అని వార్తలు వినిపిస్తున్నాయి.