మీ ఇంట్లో తులసి మొక్కలు పెంచుకుంటున్నారా ఇది తెలుసుకోండి

మీ ఇంట్లో తులసి మొక్కలు పెంచుకుంటున్నారా ఇది తెలుసుకోండి

0
84

మనకు తెలుసు తులసి ఎంతో ఆరోగ్యకరం అంతేకాదు ఎన్నో ఔషద విలువలు గుణాలు కలిగిన మొక్క..

ఆకుకూరలను మన ఇంట్లో పెంచుకోవడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా తులసి కోటలో వేసుకుని పెంచుతాం అలాగే ఆ ఆకులు కూడా మాలలు కడతాం, దేవుడికి సమర్పిస్తాం, అంతేకాదు తులసి ఆకుల రసం నిత్యం తాగేవారు ఉంటారు.

 

 

తులసి మొక్కలు పెంచుకోవడం వల్ల ఇల్లు తాజాగా, అందంగా, ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉంటుంది, ముఖ్యంగా తులసి రామ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి ఉంటాయి.. ఇవి రెండు ఆకులు తీసుకున్నా కడుపులో ఉన్న సమస్యలు తగ్గుతాయి, గొంతు దగ్గర కఫం తగ్గుతుంది, జలుబు సమస్య కూడా రాదు.

 

ఇక వంట గదిలో చిన్న చిన్న తులసి మొక్కలను పెంచుకుంటే ఎంతో మంచిది ఆహ్లదంగా ఉంటుంది కూడా.. ఉబ్బసాన్ని నివారించడంలో తులసి కీలకమైన ఔషధం. అందుకే వీలైనంత వరకూ ఇంటిలో కచ్చితంగా తులసి మొక్కలు పెంచుకోండి. అంతేకాదు పుట్టిన రోజులాంటివి వస్తే ఇలాంటి మొక్కలు చేత పిల్లల చేత నాటించండి.